Thu Mar 19 2026 14:48:53 GMT+0530 (India Standard Time)
వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి
వీధికుక్కల దాడిలో ఒక చిన్నారి మరణించిన ఘటన తెలియవచ్చింది.

వీధికుక్కల దాడిలో ఒక చిన్నారి మరణించిన ఘటన తెలియవచ్చింది. నాలుగు సంవత్సరాల కీయన్స్ వీధికుక్కలు కరవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు 20 రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కియాన్స్ కు చికిత్స కొనసాగుతుంది. ఈరోజు కియాన్స్ మరణించినట్లు బంధువులుెతెలిపారు.
స్థానికుల ఆందోళన...
ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంది. చిన్నారి కియాన్స్ పై వీధికుక్కలు దాడి చేశాయి. తమ గ్రామంలో వీధికుక్కలను తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. కియాన్స్ మరణంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధికుక్కలను గ్రామం నుంచి పంపాలని కోరుతున్నారు.
Next Story

